అభ్యర్థుల ఖర్చులు పక్కాగా రికార్డు చేయాలి: ఎం.సతీశ్‌

నల్గొండ అర్బన్, వెలుగు:  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులు పక్కాగా రికార్డు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు డీఎం నిమ్జే, ఎం.సతీశ్‌ గురు మూర్తి ఆదేశించారు.  శుక్రవారం దేవరకొండ, నిడమ నూరు ఆర్‌‌వో కార్యాలయాలను కలెక్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌వీ కర్ణన్‌‌తో కలిసి సందర్శించారు.   అకౌంటింగ్ టీమ్ రిజిస్టర్లతో పాటు సువిధ, సీ విజిల్, హెల్ప్ డెస్క్ విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..  అభ్యర్థుల బ్యాంక్‌ లావాదేవీలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని సూచించారు.  

పేపర్లు, న్యూస్‌‌ చానల్స్‌ పెయిడ్ ఆర్టికల్స్‌‌ను గుర్తించడంతో పాటు సోషల్‌‌ మీడియా ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. నామినేషన్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దన్నారు.  అనంతరం కలెక్టర్ కర్ణన్ పెద్దవూర మండలం పోతునూరులో స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్‌‌ రిజిస్టర్లను పరిశీలించారు.   

కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్

నల్గొండ అర్బన్, వెలుగు: కోవిడ్ పేషెంట్లకు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ సౌకర్యం ఉందని,  పేషెంట్ల వివరాలను ఆర్‌‌‌‌వోలకు ఇవ్వాలని కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌లో  వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలతో సమీక్షించారు. చిన్నపిల్లల ఎదుగుదలలో సమస్యలు ఉంటే పీహెచ్‌‌సీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలని సీడీపీవోలను ఆదేశించారు.