గురుద్వారలో గురునానక్ జయంతి ఉత్సవాలు షురూ

సిక్కుల తొలి మత గురువు గురునానక్ 555వ జయంతి ఉత్సవాలు సిటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో సిక్కులు గురుద్వారలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో వారి మత గ్రంథం గురుగ్రంథ సాహిబ్​ను ఉంచి శోభాయాత్ర చేపట్టారు. దారి పొడుగునా సిక్కులు చేసిన సాంప్రదాయ కత్తి, కర్ర విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  

వెలుగు, సికింద్రాబాద్