హైదరాబాద్: ఆధ్యాత్మిక మార్గంలో ప్రణాళిక తప్పని సరిగా వుండాలని, వాయిదాలు తగవని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. అన్నిరకాల మానసిక ఇబ్బందులను, అవరోధాలను గురువులు దాటిస్తారని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠ్ లో గురు పూర్ణిమ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
జులై 3వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు మంగళహారతితో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు నిర్వహించిన విశేష పూజలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పదింబావుకు హోమం నిర్వహించారు. పదకొండున్నరకు రామకృష్ణ మిషన్ సాదు సంఘ ఆవిర్భావ గాథ పుస్తకాన్ని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి బోధమయానంద ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.