ఓ మహిళకు ఆపరేషన్ చేసి కుడుపు నుంచి కణితి తొలగించారు డాక్టర్లు. ఆఫ్రికాకు చెందిన 55 ఏళ్ల మహిళ కడుపులోంచి ఫుట్ బాల్ సైజ్ ఉన్న ట్యూమర్ ను గురుగ్రామ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. 9 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న కణితిని మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి తొలగించారు. ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ అమిత్ జావేద్, ఆయన బృందం ఈ ఆపరేషన్ చేశారు.
ఈ ట్యూమర్ వల్ల గత 6 నెలలుగా మహిళకు తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని డాక్టర్ జావేద్ తెలిపారు. ఆమె చికిత్స కోసం ఆఫ్రికాలోని పలు ఆసుపత్రులను సంప్రదించింది. అయితే ట్యూమర్ సైజ్ మరీ పెద్దదిగా ఉన్నందున ఆపరేషన్ చేయడం సాధ్యం కాదని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఆమె ఆపరేషన్ కోసం ఇండియా వచ్చారు.
డాక్టర్లు CT యాంజియోగ్రఫీ, PET స్కాన్‌లతో సహా ఇమేజింగ్ పరీక్షలు, కణితి బ్లడ్ సర్కిలేషన్ వివరాలు అధ్యయనం చేశారు. ఆ కణిని మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తోంది. ఎట్టకేలకు డాక్టర్లు కణితిని గుర్తించి.. తొలగించారు. డాక్టర్లు కణితిని జీర్ణశయాంతర స్ట్రోమల్ ట్యూమర్ (GIST) అని నిర్ధారించింది. ఇది కడుపు గోడలలో ఏర్పడే అరుదైన క్యాన్సర్. కణితిని తొలగించకపోతే ప్రాణాంతక రక్తస్రావంతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసేదని డాక్టర్ జావేద్ వివరించారు.