ఢిల్లీలో ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. మళ్లీ వర్క్ ఫ్రం హోం ఆఫర్స్..!

ఢిల్లీలో ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. మళ్లీ వర్క్ ఫ్రం హోం ఆఫర్స్..!

దేశ రాజధాని ఢిల్లిలో కాలుష్య కోరలు విషాన్ని చిమ్ముతున్నాయి. రోజురోజుకూ ఢిల్లిలో గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఈ భయాంధోళనకర పరిస్థితిలో గురుగ్రామ్ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ కార్యక్రమాలు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసుకోవాలని జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. ఎంప్లాయిస్ వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని.. ఇప్పటికీ శీతాకాలం పొగమంచు కారణంగా గాలి పొల్యుషన్ అయ్యింది. దాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు వారి ఎంప్లాయిస్ తో ఇంటి నుంచే పని చేయించుకోవాలని కోరారు గురుగ్రామ్ జిల్లా అధికారులు.

ALSO READ | మహారాష్ట్రలో సర్వం సిద్ధం.. మరికొన్ని గంటల్లో పోలింగ్.. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇదే..

కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయు కాలుష్యాన్ని అరికట్టడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం దీని ముఖ్య ఉద్దేశ్యం. గురుగ్రామ్‌లో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్న కారణంగా ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఓ సలహా జారీ చేశారు.