23 ఏళ్ల ఓ వ్యక్తి తన 19 ఏళ్ల మాజీ కాబోయే భార్యను కత్తితో పొడిచి చంపాడు. వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన కొన్ని రోజుల తర్వాత గురుగ్రామ్‌లో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ విజువల్స్‌లో ఓ మహిళతో మరో మహిళతో మాట్లాడుతుండగా వ్యక్తి వారి వద్దకు వెళ్లడం చూపిస్తుంది. అంతలోనే అక్కడికి చేరుకున్న అతను.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పలుమార్లు పొడిచాడు. అప్పుడు బాధితురాలు వెంటనే నేలమీద పడిపోయింది. ఈ వీడియోలో ఘటన జరుగుతుండగా చుట్టూ చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు. అయితే వారంతా దాడి ప్రారంభం కాగానే భయంతో పారిపోయారు. ఈ షాకింగ్ విజువల్స్‌లో మహిళ రక్తపు మడుగులో ఉండా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ALSO READ :మణిపుర్ హింసాకాండ మృతులు 142.. సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్త్రీ, పురుషులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన వారు. ఆ మహిళ ఇంటి పనిమనిషిగా పనిచేసేది. వీరిద్దరికి నాలుగు నెలల క్రితమే నిశ్చితార్థానికి ముహూర్తం కుదిర్చినా.. రెండ్రోజుల క్రితమే అది ఆగిపోయింది. దీంతో ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు.