
హైదరాబాద్, వెలుగు: గురుకుల సెట్ (ప్రత్యేక కేటగిరీ ఎంట్రన్స్టెస్ట్) ఫలితాలను సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి శనివారం విడుదల చేశారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలో ప్రత్యేక కేటగిరీకి చెందిన మొత్తం 13,927 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మొదటి దశలో 1,944 మంది విద్యార్థులు సీటు పొందారని పత్రిక ప్రకటనలో కన్వీనర్ తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో (టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్), (టీజీటీ డబ్ల్యూఆర్ఈఐఎస్), (టీజీఎంబీపీడబ్ల్యూఆర్ఐఈఎస్), (టీజీఆర్ఈఎస్) 5వ తరగతిలో ప్రవేశానికి గత నెల ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ఎగ్జామ్ నిర్వహించారు.
ఇందులో ప్రత్యేక కేటగిరీకి చెందిన వికలాంగులు(పీహెచ్సీ), (ఆర్ఫన్ అనాధలు), ఫిషర్ మన్(మత్స్యకార్మికులు), మైనార్టీ, సీఏపీ, ఈడబ్ల్యూఎస్, ఏఈక్యూ, ఏజెన్సీ ఏరియా, ఎంబీసీ కేటగిరీకి చెందిన ప్రవేశ పరీక్షా ఫలితాలను రిలీజ్చేశామని తెలిపారు. అలాగే 5 నుంచి 9 వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశామని పేర్కొన్నారు.