
నల్గొండ అర్బన్, వెలుగు : సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025 –26 విద్యాసంవత్సరానికి గాను5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం నల్గొండలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు మొత్తం 12,929 మంది విద్యార్థులకు 12,503 మంది హాజరయ్యారని తెలిపారు. 426 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 96.71 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.