- ఇరువర్గాల మధ్య తోపులాట
కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల స్కూల్‌ను తిమ్మాపూర్ ఎల్ఎండీకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి ధర్నా చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ను కలిసే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో అధికారులు చర్చలు జరిపారు. చివరకు స్కూల్ తరలింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన విరమించారు.
సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో
జ్యోతినగర్, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఐదో డివిజన్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్ష పార్టీల నాయకులు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్ సీఎల్విఫలమయ్యాయని ఆరోపించారు. ఐదో డివిజన్ ఇరుగ్గా ఉండటంతో భారీవాహనాలు, సీఐఎస్ఎఫ్వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి ఎస్బీఐ నుంచి నర్రశాల పల్లి వరకు, శ్రీనగర్ కాలనీ నుంచి ఓసీపీ4 వరకు రోడ్డు విస్తరణ చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష లీడర్లు వెంగల పద్మలత, బాపు, రహీం, రాంబాబు, ప్రతాప్ రాజ్, గీట్ల లక్ష్మారెడ్డి, స్వరూప పాల్గొన్నారు.
జమ్మికుంటలో వడ్డెరుల ఆందోళన
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట ఆటోనగర్ సమీపంలోని 275 సర్వే నెంబర్లో వడ్డెరలకు సంబంధించిన ఎకరం భూమిని దళితబంధు పేరుతో జడ్పీ చైర్పర్సన్ విజయ కుటుంబీకులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక గాంధీ చౌరస్తాలో వడ్డెరలు ఆందోళన చేశారు. బుధవారం స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి దళితబంధు లబ్ధిదారులు(జడ్పీ చైర్పర్సన్కుటుంబీకులు) ప్రయత్నించగా వారిని వడ్డెరలు అడ్డుకున్నారు. 50 ఏండ్లుగా తమ తాతలు, తండ్రులు బండ కొట్టుకొని జీవించేవారమని, మా 100కుటుంబాలకు చెందిన భూమిని దళితబంధు పేరుమీద జడ్పీ చైర్పర్సన్ కుటుంబీకులు కాజేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల కింద దళితబంధు కింద వేలాది మంది అర్హులైనవారు ఉండగా జడ్పీ చైర్పర్సన్కుటుంబీకులకు కేటాయించడం ‘వీ6 వెలుగు’లో వార్తలు పబ్లిష్అయ్యాయి. అప్పటినుంచి స్తబ్ధుగా ఉన్న ఈ ఇష్యూ బుధవారం వడ్డెరల ఆందోళనతో బయటకు వచ్చింది.
50 ఏండ్లకు ‘అపూర్వ’ కలయిక
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని ప్రభుత్వ స్కూల్లో తొలి 10వ తరగతి (1973–74) బ్యాచ్ స్టూడెంట్లు సుమారు 50 ఏండ్లకు బుధవారం కలుసుకున్నారు. ఇందులో చాలా మంది సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, సింగరేణి సంస్థలో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసి రిటైర్అయినవారున్నారు. మనుమలు, మనమరాండ్లతో కాలక్షేపం చేస్తున్న సమయంలో ఇప్పుడు కలవడం సంతోషంగా ఉందని నాటి విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజా నాట్యమండలి కళాకారుడు కె.స్వామి, రిటైర్డ్ ఏజీఎం రవికుమార్, జోసెఫ్, రామిల్ల రామలింగం తదితరుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సంధ్య బాల్యంలోని తీపి జ్ఞాపకాలను పాట రూపంలో ఆలపించారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు రామ సుధాకర్ రాజు, పీటీ స్వామి, రాజ కొమురయ్య, మధుసూదన్ రావు, గోవర్ధన్, పద్మావతిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ప్రత్యేక నిధులతో కరీంనగర్ అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరీంనగర్ సిటీ దినదినాభివృద్ధి చెందుతోందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం స్థానిక 11,42,46 డివిజన్లలో రూ.45లక్షల అభివృద్ధి పనులను కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్న నిధులతో నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వావిలాలపల్లిలో అంబేద్కర్ మెమోరియల్ ను అందంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను స్పీడ్‌గా పూర్తి చేయాలన్నారు. క్వాలిటీ పాటించని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించమని, వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. 2023లోపు స్మార్ట్ సిటీ పనులన్నింటిని పూర్తి చేసి, భావితరాలకు అందమైన నగరాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛసర్వేక్షణ్‍లో మెరుగైన ర్యాంకు కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ ఈ నాగమల్లేశ్వర్ రావు, డీఈలు మసూద్ అలి, ఓం ప్రకాష్, కార్పొరేటర్లు నర్మద, వనజ, శ్రీదేవి, లీడర్లు నర్సయ్య, అశోక్ రావు, పవన్ కుమార్ పాల్గొన్నారు.
దళితబంధు పేరుతో ప్రభుత్వ భూమిని కాజేస్తున్రు..
జమ్మికుంటలో వడ్డెరుల ఆందోళన
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట ఆటోనగర్ సమీపంలోని 275 సర్వే నెంబర్లో వడ్డెరలకు సంబంధించిన ఎకరం భూమిని దళితబంధు పేరుతో జడ్పీ చైర్పర్సన్ విజయ కుటుంబీకులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక గాంధీ చౌరస్తాలో వడ్డెరలు ఆందోళన చేశారు. బుధవారం స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి దళితబంధు లబ్ధిదారులు(జడ్పీ చైర్పర్సన్కుటుంబీకులు) ప్రయత్నించగా వారిని వడ్డెరలు అడ్డుకున్నారు. 50 ఏండ్లుగా తమ తాతలు, తండ్రులు బండ కొట్టుకొని జీవించేవారమని, మా 100కుటుంబాలకు చెందిన భూమిని దళితబంధు పేరుమీద జడ్పీ చైర్పర్సన్ కుటుంబీకులు కాజేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలల కింద దళితబంధు కింద వేలాది మంది అర్హులైనవారు ఉండగా జడ్పీ చైర్పర్సన్కుటుంబీకులకు కేటాయించడం ‘వీ6 వెలుగు’లో వార్తలు పబ్లిష్అయ్యాయి. అప్పటినుంచి స్తబ్ధుగా ఉన్న ఈ ఇష్యూ బుధవారం వడ్డెరల ఆందోళనతో బయటకు వచ్చింది.
కరీంనగర్-జగిత్యాల రోడ్డుపై..రైల్వే ట్రాక్ కు రిపేర్లు
గంగాధర, వెలుగు: కరీంనగర్-–-జగిత్యాల మెయిన్‌రోడ్డులో గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని 29/టి రైల్వే గేటు వద్ద ట్రాక్‌కు రిపేర్లు చేపట్టారు. ఈ పనులు వారం పాటు సాగనున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. ఈ పనులతో జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్‌కు వెళ్లాల్సిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. గంగాధర చౌరస్తా నుంచి మల్యాల మీదుగా జగిత్యాలకు, గంగాధర, బోయినపల్లి, వేములవాడ మీదుగా జగిత్యాల, నిజామాబాద్ వాహనాలను మళ్లించారు. వాహనాల మళ్లింపుతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడి
కరీంనగర్ క్రైం, సైదాపూర్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వంట నూనెలు, ఆహార పదార్థాలు కల్తీ చేసి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని విష్ణు ఇండస్ట్రీస్ కు చెందిన కావేరి ఆయిల్ మిల్లో ఎటువంటి అనుమతులు, లేబుల్ లేకుండా ఉన్న 2500 లీటర్ల నూనెను సీజ్ చేశారు. ఆ ఆయిల్పామాయిలా, సన్ ఫ్లవర్ఆయిలా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. శాంపిల్స్ సేకరించామని ల్యాబ్ రిపోర్ట్స్వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దాడుల్లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, బి.సంతోష్ కుమార్, ఎస్ఐ చేరాలు, సైదాపూర్ఎస్ఐ ఆరోగ్యం, ఫుడ్ ఇన్స్పెక్టర్అనూష పాల్గొన్నారు.