కొత్తగూడెంలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలం గాంధీ పురంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుకుల స్కూల్ అండ్ కాలేజీ లో తమకు సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎలుకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు.

పాఠశాలలో సరైన గదులు లేక పోవడం, భోజనం నాణ్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వీటితో పాటు పాఠశాలకు ప్రహరీ లేదని, నీటి సౌకర్యం కూడా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమని ఎలుకలు కరిచినా పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా పోలీసుల జోక్యంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.