పర్వతగిరి, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని గురుకుల ఆఫీసర్ మాధవీదేవి, క్రీడల ఇన్‌చార్జి రమణ సూచించారు. 7వ జోనల్ స్థాయి ఆటల పోటీలను శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో ప్రారంభిచారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆటల వల్ల శారీరక ధారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. పోటీలకు వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 550 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్ వెంకన్న, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు.
5కే రన్ విజేతలకు మెడల్స్
మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన 5కే రన్ విజేతలకు శనివారం మరిపెడ మున్సిపల్ కమిషనర్ రాజు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.