
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా 2025– 26 అకడమిక్ ఇయర్‌కు 5, 6, 7, 8, 9 క్లాసుల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ఎంట్రన్స్ టీజీ సెట్– 2025కు 96.40 శాతం మంది స్టూడెంట్స్ అటెండ్ అయినట్టు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా.. 1,67,618 మంది పరీక్ష రాశారని ఆమె పేర్కొన్నారు. 10 రోజుల్లో ఫలితాలు రిలీజ్ చేస్తామని సెక్రటరీ వెల్లడించారు.