తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి హాకీ, బేస్ బాల్పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్పి.వనజ తెలిపారు. ఎస్కే శాహీరీన్, నందినీ, మేఘన, మానస, రేవతి, సంజన, శ్రవిక హాకీ పోటీలకు, ఎన్.జోషిక బేస్బాల్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.
వీరంతా త్వరలో కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.