హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్లు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఉన్న టీచర్ల సంఘం పీఆర్టీయూ టీఎస్కి అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ)ని ఏర్పాటు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని పీఆర్టీయూ టీఎస్ భవన్లో అన్ని సంక్షేమ గురుకుల స్కూళ్లు, కాలేజీల టీచర్లు, లెక్చరర్లు సమావేశమయ్యారు. సంఘం కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
పీఆర్ జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా వి. దిలీప్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎ. నరేశ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎం. వేణుప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత వివిధ సామాజికవర్గాల గురుకులాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లనూ నియమించుకున్నారు.