
ధన్వాడ, వెలుగు: నెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకులం స్టూడెంట్లు ఎంపికైనట్లు నెట్ బాల్ కోచ్, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ రాజారాం తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల్ విద్యాపీఠ్ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్–14 విభాగంలో పరమేశ్, సిద్ధు, అశోక్, అండర్–17 విభాగంలో సిద్దార్థ, అవినాశ్ ప్రతిభ చూపి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 3 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే 67వ జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.