రిచ్ దేవుడు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది తిరుమలలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.. ఆ దేవదేవుని ఆస్తుల విలువ సుమారు రూ. 3లక్షల కోట్ల పైనే ఉంటుంది. అయితే.. కేరళలోని గురువాయూర్ దేవస్థానం కూడా టీటీడీతో పోటీ పడుతోంది. ఆర్టీఐ చట్టం ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం గురువాయూర్ దేవస్థాన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉందని తేలింది.. దేవస్థానానికి సంబంధించి 1వెయ్యి 84.76 కిలోల బంగారం, రూ. 2,053కోట్ల డిపాజిట్లు, 271ఎకరాల భూములు ఉన్నట్లు సమాచారం.
Also Read :- కాకా ఆలోచనలకు మనమంతా వారసులమే.!
దేవస్థానానికి సంబంధించిన బంగారంలో 869కిలోల బంగారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ స్కీంలో డిపాజిట్ చేశారని.. దీని విలువ సుమారు రూ. 7వేల కోట్లుగా ఉంటుందని సమాచారం. ఇది కాకుండా దేవస్థానం యొక్క రోజువారీ అవసరాల కోసం 141.16 కిలోల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. భూములు కాకుండా.. గురువాయూర్ దేవస్థానం ఆస్తుల విలువ రూ. 10వేల కోట్ల పైనే ఉంటుందన్నమాట.
అయితే.. గురువాయూర్ దేవస్థానం ఆస్తుల విలువ అధికారికంగా వెల్లడించాలంటూ కేరళ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.. ఈ పిటీషన్ పై వచ్చే వారంలో ( అక్టోబర్ 13 - 19, 2024 ) విచారణ జరగనుందని సమాచారం.