Gus Atkinson: సుందర్‌కు తప్పని నిరాశ.. ఇంగ్లాండ్ పేసర్‌కు ఐసీసీ అవార్డ్

ఇంగ్లాండ్ సీమర్ గుస్ అట్కిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. జూలై నెలలో వెస్టిండీస్ జరిగిన టెస్ట్ సిరీస్ లో  అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డుకు భారత ప్లేయర్ వాషింగ్ టన్ సందర్ తో పాటు స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ నామినేట్ అయ్యారు. జూలై నెలలో వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో 22 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

దిగ్గజ పేసర్ అండర్సన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించిన అట్కిన్సన్ తొలి మ్యాచ్ లోనే 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ఈ యువ పేసర్.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో ఔరా అనిపించాడు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టుకు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డును గెలుచుకుంది.
   
సుందర్ జింబాబ్వే సిరీస్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ ఒమన్ పై అరంగేట్ర మ్యాచ్ లోనే ఏడు వికెట్లు తీసి అరుదైన రికార్డ్ సృష్టించాడు. టీమిండియా ఆల్ రౌండర్ కు ఈ అవార్డు వస్తుందని ఆశించినా నిరాశ తప్పలేదు. మరోవైపు మహిళల విభాగంలో స్మృతి మందాన, షెఫాలీ వర్మలు ఎంపికైనా అవార్డు వరించలేదు.