నిజామాబాద్ సభలోప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్దారు. తెలంగాణపై మోదీ విషం కక్కుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రే లేదన్న ఆయన.. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు. వారసత్వపు రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బీజేపీ అని విమర్శించారు.
బీజేపీలో కుటుంబ పార్టీలో నుంచి వచ్చినవారు లేరా అని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. విద్యావంతుడు, మంచి అడ్మినిస్ట్రేటివ్ అయిన మంత్రి కేటీఆర్ ఎదో ఒకరోజు తెలంగాణకు సీఎం అవుతారని చెప్పారు. కేటీఆర్ సీఎం కావాలంటే.. మోదీ సహకారం అక్కర్లేదని, బీఆర్ఎస్ శాసనసభ పక్షం,కేసీఆర్ ఉంటే చాలున్నారు. తొమ్మిదిన్నరేళ్ళల్లో అన్ని రంగాల్లో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు.
Also Read :- వచ్చే ఎన్నికల్లో వాళ్ల జన్మ ముగుస్తుంది
తెలంగాణ ఏర్పాటులో రక్తం ఎరులైపారిందని అంటున్న మోదీ.. ఎక్కడ రక్తం ఎరులైయిందో చూపించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన పక్కన అవినీతిపరులకు చోటు లేదంటున్న మోదీ..బీజేపీలో కొంతమంది సీఎంలు ఈడీ, సీబీఐ కేసుల్లో ఎందుకు ఇరుక్కునన్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుత్తా చెప్పుకొచ్చారు.