కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయడమే బీజేపీ పని

మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి  మునగడం ఖాయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తనతో పాటు వెంకట్ రెడ్డిని కూడా ముంచుతున్నాడని ఎద్దేవా చేశారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారానికి వెళ్లకపోవడం విడ్డూరమన్నారు. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. 

మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం లేదన్న ఆయన.. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయడమే బీజేపీ తన పనిగా పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటి మీదికెల్లి తప్పు చేశారని.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలు చెడ గొట్టేందుకు కాషాయపార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.