కేసీఆర్ 4 కోట్ల ప్రజల హీరో అయితే.. మరి ఓట్లు ఎందుకు వేయలేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

కేసీఆర్ 4 కోట్ల ప్రజల హీరో అయితే.. మరి ఓట్లు ఎందుకు వేయలేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

కేసీఆర్ 4 కోట్ల ప్రజల హీరో అయితే.. మరి ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా గుత్తా ఈ  కామెంట్స్ చేశారు. కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.. నాలుగు కోట్ల మంది హీరో అయితే ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదన్నారు. 

Also Read :- సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదు

మీడియా చాట్చాట్లో గుత్తా కామెంట్స్:

  • ప్రభుత్వం 100 శాతం పర్ఫెక్ట్ కులగణన సర్వే చేసింది
  • అసలు కులగణ మీద.. బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది?
  • దేశంలోనే  బీసీ కులగణన చేసింది ఇది మొదటిసారి కదా 
  • బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆఫీసియల్ రికార్డు లేదు..
  • అసెంబ్లీ లో పెడితే రికార్డు లో ఉండేది.
  • ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడు..
  • కులం, మతం తో సంబంధం ఉండదు.
  • బీసీ రిజర్వేషన్లు 42% అసెంబ్లీ లో పెట్టి పాస్ చేయించి పార్లమెంట్ కు పంపిస్తాం.
  • బీజేపీ బీసీ కులగణ కు వ్యతిరేకమని అందరికీ తెలిసిందే.
  • ఉచితాల పై ఒక కఠినమైన చట్టం రావాల్సిందే..
  • రాష్ట్ర బడ్జెట్ బట్టి పధకాలు ఉండాలి..
  • ఈ ప్రభుత్వ పాలనా పర్వాలేదు...
  • నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు...
  • ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు.
  • ఈ కులం, మతం గురించి ప్రశ్నించుకోవడం మంచిది కాదు..
  • అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు  కలిసి వస్తే పార్టీ ల పై, ప్రభుత్వం పై, అభ్యర్థుల పై భారం తగ్గుతుంది.
  • సరైన ధర, కరెంటు ఇవ్వకపోతే ప్రజలు,  రైతులే రోడ్డు పైకి వస్తారు.
  • అప్పుడు మనం వెళ్ళి ఆ గుంపులో కూర్చోవాల్సిందే....