వరంగల్ జిల్లాలో గుట్కా సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 40 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 10 లక్షలకు పైగా విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. గోపాల్ స్వామి టెంపుల్ దగ్గర గుట్కాను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులు బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకవచ్చి హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.