ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాకు మీద షాకులు తుగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి భువనగిరి లేదా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.