నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం: మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి

నల్గొండ, వెలుగు: కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంతో  కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని  శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి విమర్శించారు.  శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ..   శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే హక్కు లేదన్నారు.  కానీ కరెంట్ ఉత్పత్తి  చేసే హక్కు తెలంగాణ కు ఉందన్నారు.   శ్రీశైలానికి మరో వంద టీఎంసీలు, సాగర్‌‌‌‌కు మరో రెండు వందల టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టులు నిండుతాయన్నారు. ఆఫీసర్లు చెప్తున్న ప్రకారం మరో 20, 30 టీఎంసీల నీరు వస్తే సాగర్​ మొదటి జోన్​వరకు సాగునీరు ఇవ్వొచ్చని, ఇ ప్పటికే 30 టీఎంసీల వరకు అందుబాటులో ఉందని చెప్పారు.  ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగునీరు అడుగుతున్నారన్నారు. సెప్టెంబర్​ వరకు వరదలు వచ్చే చాన్స్​ ఉందన్నారు.  దాంతో సాగర్​కు కూడా వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్పుడు నీటి విడుదలకు చేయొచ్చని గుత్తా పేర్కొన్నా రు.