దైవ చింతనతో మానసిక ప్రశాంతత : గుత్తా సుఖేందర్ రెడ్డి

దేవరకొండ, వెలుగు : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిఒక్కరూ షిర్డీ సాయిబాబా అనుగ్రహం పొందాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలో షిర్డీ సాయిబాబా, జ్ఞాన సరస్వతి ఆలయ 18వ అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, పసునూరి యుగేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.