కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడి దాడి : గుత్తా సుఖేందర్ రెడ్డి

బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో సీఎం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంగా రాష్టంలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.  సీఎం కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారన్నారు. 

2014మోడీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని గుత్తా  తెలిపారు.  దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు.. అనిశ్చితకరమైన వాతావరణం ఉందన్న ఆయన...  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర వారిదని గుత్తా వ్యాఖ్యనించారు.