కేటీఆర్​ పిలవలే..గుత్తా రాలే.. నల్గొండ సభకు హాజరవకుండా అలక

నల్గొండ, వెలుగు: మంత్రి కేటీఆర్ పిలవకపోవడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నల్గొండ జిల్లాలో జరిగిన ఆశీర్వాద సభకు హాజరు కాలేదని తెలిసింది. సభకు రావాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదివారం స్వయంగా గుత్తా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. కానీ కేటీఆర్ పిలిస్తేనే  సభకు హాజరవుతానని గుత్తా అంతకుముందే మీడియా ప్రతినిధులతో చెప్పారు. నల్గొండ అభివృద్ధి కేసీఆర్, కేటీఆర్ వల్లనే జరిగిందని గుత్తా మీడియాతో చెప్పడం వెనక ఎమ్మెల్యే మీద ఆయనకున్న వ్యతిరేకత స్పష్టమైంది.