ఢిల్లీ డైరెక్షన్ లో జాతీయ పార్టీలు నడుస్తున్నాయి

మునుగోడు ఉప ఎన్నిక అక్కడి నియోజకవర్గం ప్రజలు కోరుకుంటే రాలేదని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ రాష్ర్టంలో అధికారంలోకి వస్తామని జాతీయ పార్టీలు కలలుగంటున్నాయంటూ సెటైర్ వేశారు. రాష్ర్టంలో జాతీయ పార్టీ ఏది కూడా అధికారంలోకి రాదని చెప్పారు. ఢిల్లీ డైరెక్షన్ లో జాతీయ పార్టీలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన తెలంగాణకు శ్రీరామ రక్షని చెప్పారు.