మిర్యాలగూడ, వెలుగు : ఎన్‌బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ పోటీ పరీక్షలకు కోచింగ్‌లు, జాబ్ మేళాలు ఏర్పాటు చేసి యువతకు భరోసా ఇస్తున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్‌లో టాస్క్, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాబ్‌మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కాల్వాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంఎస్జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరళా హనుమంత రెడ్డి, పాల్గొన్నారు.