తెలుగు భాషా, సంస్కృతిని రక్షించుకోవాలి: ​ గుత్తా సుఖేందర్​ రెడ్డి 

తెలుగు భాషా, సంస్కృతిని రక్షించుకోవాలి: ​ గుత్తా సుఖేందర్​ రెడ్డి 

ఖైరతాబాద్, వెలుగు: తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక -సారస్వత సంఘం (ఇట్​క్లా) ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన  ప్రముఖులకు ఇట్​క్లా -2025 విశ్వ తెలుగు వెలుగు పురస్కారాలను అందజేశారు. ఇట్​క్లా అధ్యక్షుడు  డాక్టర్​ ధర్మారావు అధ్యక్షతన  సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మంగళవారం జరిగిన ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి హాజరై పురస్కారాలను అందజేశారు.  

పురస్కారాలు అందుకున్న వారిలో  మృదంగ మాస్ట్రో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు,  రైల్వే శాఖ మాజీ జీఎం చేబియ్యం రామకృష్ణ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత లయన్​ డాక్టర్​ ఎ. నటరాజ్, డాక్టర్ బింగి నరేందర్​ గౌడ్​ ఉన్నారు. గుత్తా సుఖేందర్​రెడ్డిని ధర్మారావు సత్కరించి మోమెంటో అందజేశారు.