హైదరాబాద్: సుంకిశాల నిధులను ఎస్ఎల్ బీసీ సొరంగానికి కేటాయించి ఉంటే ఇప్పటికే పూర్తి జరిగి, గ్రావిటీ ద్వారా ఈజీగా వాటర్ వచ్చే అవకాశం ఉండేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోకుండా, పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించి, పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
వచ్చే రెండేళ్లలో నక్కలగండి, పెండ్లిపాకల ప్రాజెక్టులను పూర్తిచేసి హైదరాబాద్కు తాగునీరు అందిస్తామన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని ఆయకట్టు కాలువల నిర్మాణం, లైనింగ్ పూర్తి చేయాలన్నారు.