మెట్ పల్లి, వెలుగు: రూపాయికి పది, పదికి వంద, వందకు వెయ్యి.. ఇలా ఎంత పెడితే అంతకు పదింతలు డబ్బు వస్తుందని ఆశ చూపెడుతున్న 'మట్కా' ఆట జగిత్యాల జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. యు వకులు, కూలీలు జూదంతో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. రూ.5 నుంచి రూ.10ల వడ్డీకి అప్పు చేసి మట్కా ఆడుతున్నారు. అప్పులు తీర్చలేక గతంలో కొందరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఒకప్పుడు ‘బ్రాకెట్’ ఆటగా పేరొందిన మట్కా ప్రస్తుతం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలతో పాటు పలు మండలాల్లో జోరుగా నడుస్తోంది. పోలీసులకు దొరక్కుండా ఏజెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరికి కొందరు పోలీ సులు సహకరిస్తున్నట్లు ఆరోపణులున్నాయి.
పగలు ఓపెన్.. రాత్రి క్లోజ్
ముంబై, పుణే, నాగ్‌పూర్, ధర్మాబాద్, వర్లి ప్రాంతాలు ప్రధాన కేంద్రాలకు అనుబంధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, పె ర్కిట్ అ డ్డాలుగా జగిత్యాల ఏజెంట్లు గుట్టుచప్పుడు కాకుండా మట్కా వ్యాపారం కొనసాగిస్తున్నా రు. పగలు కళ్యాణ్, రాత్రి ముంబై ఆటలు నడుస్తున్నాయి. కళ్యాణ్‌కు మధ్యాహ్నం 2 గంటల దాకా ఆయా నంబర్లపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సబ్ ఏజెంట్ల ద్వారా మా త్రమే బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బులు తీ సుకుంటుంటారు. ముంబై అనే మట్కాకు సంబంధించిన నంబరును, డబ్బులను రా త్రి 8 గంటల దాకా తీసుకుంటుంటారు. గతంలో రహస్యంగా కాగితం చిట్టీలపై నంబర్లతో సాగిన మట్కా దందా సాంకేతికత పెరగడంతో నేడు గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ప్రస్తుతం చి ట్టీలతో కాకుండా సెల్ ఫోన్లలో, వాట్స్ ఆప్ మెసేజ్‌ల ద్వారా ఆన్లైన్లో ఆడుతున్నారు. డబ్బులు సైతం ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి
మట్కా నిరంతరం కొనసాగుతున్నా పోలీ సులు ఆవైపు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మట్కా నిర్వాహకులపై నిఘా లేకపోవడంతో వారు ప్రధాన చౌరస్తాలలో తమ పని కానిచ్చేస్తున్నారు. కోరుట్లలోని అల్లమియ్య గుట్ట, యేఖిన్ పూర్, పాత బ స్టాండ్, గోదాం, స్టేడియం, ఐలాపూర్ రోడ్డు, మెట్‌పల్లి పట్టణంలోని అంగడిబజార్, చావిడి చౌరస్తా, కొత్త బస్టాండ్ పరిసరాలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రధా నంగా మట్కా కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు వార్డు ల్లో మట్కా సబ్ ఏజెంట్లు తిరిగి ఎవరికీ అను మానం రాకుండా డబ్బులు సేకరించి నిర్వా హకులకు అప్పగించి కమీషన్లు పొందుతు న్నట్లు తెలుస్తోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం : రవీంద్రారెడ్డి, డీఎస్పీ, మెట్ పల్లి.
మట్కా దాందాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నిర్వాహకులు, ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జూదానికి అలవాటుపడి ఆర్థికంగా నష్టపోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. చట్ట వ్యతిరేక కా ర్యకలాపాలు నిర్వహిస్తే ఎంతటివారైనా కఠి నంగా వ్యవహరిస్తాం. జూదం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.