
గువాహతి: ఇండియా విమెన్స్ డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో గువాహతి మాస్టర్స్ సూపర్ 100 టోర్నమెంట్‌లో వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అశ్విని– క్రాస్టో 21-–18, 21-–12తోలి హువా జొయు–వాంగ్ జి మెంగ్ ( చైనా)పై నెగ్గారు. సింగిల్స్‌లో అన్మోల్ 21-–14, 13-–21, 19-–21తో కై యన్ యన్ (చైనా) చేతిలో ఓడగా.. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సతీష్ కుమార్ 21-–17, 21-–14తో జు గ్వాన్ చెన్ (చైనా)పై గెలిచాడు.