కొత్త ప్రపంచాన్ని చూపించే  తంగలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఆగస్టు 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఇండియానా జోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లాంటి సినిమా ఇది. కథ వినగానే చాలా ఎగ్జైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. స్వాతంత్ర్యానికి ముందు ట్రైబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో జరిగే కథ. వాళ్ల సంగీతం ఎలా ఉంటుందా అని ఆలోచించా. అందుకోసం ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్జర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, కథ నేపథ్యానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాను. 

భారీ సినిమా కావడంతో 50 రోజులు రీ రికార్డింగ్ చేశా.  టైటిల్ సాంగ్, మనకి మనకి అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం లాంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా బీజీఎం చేశాను. విక్రమ్ గారు ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇక తెలుగులో దుల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, నితిన్ ‘రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాలకు పనిచేస్తున్నా. అలాగే దిల్ రాజు గారితో, వైజయంతి బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమాలు చేయాల్సి ఉంది’ అని చెప్పాడు.