భార్యకి విడాకులిచ్చి హీరోయిన్ తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డేటింగ్.. ఇదే అంటూ క్లారిటీ...

భార్యకి విడాకులిచ్చి హీరోయిన్ తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డేటింగ్.. ఇదే అంటూ క్లారిటీ...

తమిళ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ గత ఏడాది తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జివి ప్రకాష్ కుమార్ ఆ విడాకుల అనంతరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని క్లారిటీ ఇచ్చాడు. కానీ కొందరు మాత్రం జివి ప్రకాష్ కుమార్ కోలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ దివ్య భారతితో ప్రేమలో పడ్డాడని, డేటింగ్ కూడా చేస్తున్నారని ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. 

ఈ విషయం గురించి జివి ప్రకాష్ కుమార్, దివ్య భారతి స్పందిస్తూ తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, తమ మధ్య ప్రేమ, గీమా వంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. అలాగే జివి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ కొందరు తమ మధ్య ఉన్నటువంటి స్నేహ  బంధం, సాన్నిహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అందుకే ప్రేమ, డేటింగ్ వంటివి అంటగడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక దివ్య భారతి మాట్లాడుతూ చాలామంది స్నేహితులు, బంధువులు తమ రిలేషన్ షిప్ గురించి అడిగి విసిగిస్తుంటారని వారికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డానని తెలిపింది.

ఈ విషయం తనతల్లి దండ్రులకి క్లారిటీ ఉందని ఇతరులతో మాట్లాడటం మానేశానని దాంతో లవ్, డేటింగ్ రూమర్లు తగ్గిపోయాయని చెప్పుకొచ్చింది. అయినా ఇద్దరు వ్యక్తులు కలసి ఉంటె వారి మధ్య ప్రేమ బంధం మాత్రమే కాదు ఫ్రెండ్షిప్, సాన్నిహిత్యం ఇలాంటివి కూడా ఉంటాయని కానీ వీటిని అర్థం చేసుకోకుండా చేసే ప్రచారాల కారణంగా మంచి ఫ్రెండ్స్ మధ్య కూడా విభేదాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా జివి ప్రకాష్ కుమార్ & దివ్య భారతి కింగ్ స్టన్ అనే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా జివి ప్రకాష్ కుమార్ నిర్మించాడు. అలాగే మ్యూజిక్ కూడా అందించాడు. ఈ సినిమా మార్చ్ 7న పాన్ ఇండియా లాంగ్వేజస్ లో రిలీజ్ కాబోతోంది.