
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తూ నిర్మించిన తమిళ చిత్రం ‘కింగ్స్‌టన్’. దివ్య భారతి హీరోయిన్. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న విడుదల కానుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నితిన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి.
ట్రైలరే ఇలా ఉంటే, సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. కచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్ముతున్నా. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేశ్వర్ రెడ్డి గారు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మంచి హిట్ అయ్యి, ఆయనకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా’ అని టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. దర్శకులు వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల, నిర్మాతలు రవి శంకర్, శశిధర్ ఈ కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ మూవీ నాకొక బిగ్ డ్రీమ్. నిర్మాతగా నా ఫస్ట్ మూవీ. 'హ్యారీ పోటర్' లాంటి సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఈ మూవీని తీశాను. కానీ ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టలేదు. అలాంటి స్టాండర్డ్స్ ఉన్న విజువల్ వండర్స్ అందిస్తున్నాం. ఇది స్టార్టింగ్ మాత్రమే.. ఈ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు రాబోతున్నాయి’ అని చెప్పాడు. హీరోయిన్ దివ్య భారతి సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.