ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ విడుదల చేశారు. ఈ ప్రకటనతో వీళ్ళ అభిమానులు షాకవుతున్నారు.
విడాకుల విషయాన్ని తెలుపుతూ విడుదల చేసిన నోట్ లో ఈ విదంగా రాసుకొచ్చారు జీవీ ప్రకాష్.. చాలా ఆలోచించిన తర్వాత నేను, సైంధవి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మా 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాలు ఇంకా బాగవ్వాలనే కారణంతోని ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని, మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విషయానికి వస్తే.. ఈ ఇద్దరు చిన్నప్పటి నుండి సన్నిహితులు. కొంతకాలానికి ఆ స్నేహమే ప్రేమగా మారింది. అలా దాదాపు 12 ఏళ్ళ పాటు ప్రేమలో ఉన్న వారు.. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక 2013లో కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ, హఠాత్తుగా విడాకుల విషయం చెప్పి అందరికీ షాకిచ్చారు ఈ జంట.