అధికారిక కార్యక్రమంగా జి.వెంకటస్వామి (కాకా) జయంతి, వర్ధంతి

అధికారిక కార్యక్రమంగా జి.వెంకటస్వామి (కాకా) జయంతి, వర్ధంతి

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమ నేత గడ్డం వెంకటస్వామి కాకా జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జయంతి అయిన అక్టోబర్ 5వ తేదీని.. వర్థంతి అయిన డిసెంబర్ 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో నివాళులు అర్పించనున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆయన జ్ణాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జయంతి, వర్థంతి రోజుల్లో జి.వెంకటస్వామి కాక.. తెలంగాణ రాష్ట్రానికి, పేద, బడుగు, బలహీన వర్గాల నేతగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నది ప్రభుత్వం. ఈ మేరకు అక్టోబర్ 5 జయంతి, డిసెంబర్ 22 కాకా వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సీఎస్ శాంతికుమారి 2024, సెప్టెంబర్ 26వ తేదీన రెండు జీవోలు జారీ చేశారు. కాకా జయంతి, వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు చూసుకోవాలని యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ కల్చర్ డిపార్ట్‎మెంట్‎ను సీఎస్ ఆదేశించారు.