1962కు కాల్‌‌ రాగానే రెస్పాండ్ కావాలి : డాక్టర్ భగీస్ మిశ్రా

సూర్యాపేట, వెలుగు : 1962 కు కాల్ రాగానే వెటర్నరీ సిబ్బంది స్పందించాలని జీవీకే ఈఏంఆర్ఐ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి డాక్టర్ భగీస్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని పశు వైద్యశాలలో మొబైల్ వెహికల్ రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు.  జిల్లా పరిధిలో నాలుగు మొబైల్ వెహికల్స్‌‌ ఉన్నాయని, రైతులు 1962 నెంబర్‌‌‌‌కు కాల్‌‌ చేసి సేవలు పొందేలా అవగాహన కల్పించాలన్నారు.  

పశువులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయాలని, రైతులు ఎలాంటి సమస్య కోసం కాల్‌‌ చేసినా వెళ్లాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్, ఎమర్జెన్సీ మేనేజ్‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్ సోమేశ్వర్,   పశువైద్య సిబ్బంది  ప్రశాంత్, నజిర్, నగేశ్, గోపి పాల్గొన్నారు.