షేర్ల‌ను విడిపించుకునేందుకు లోన్ వేటలో జీవీకే

షేర్ల‌ను విడిపించుకునేందుకు లోన్ వేటలో జీవీకే

బ్యాంకుల్లో తనఖా పెట్టిన షేర్ల‌ను తిరిగి విడిపించుకునేందుకు జీవీకే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ హోల్డింగ్స్ ‌‌(జీవీకేఏహెచ్‌ఎల్‌‌) ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరగా అప్పులు ఇచ్చేవారి కోసం వెతుకుతోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ముంబై ఇంటర్నేషనల్‌‌ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లిమిటెడ్‌లో (మియల్‌‌) మెజార్టీ వాటా జీవీకేఏహెచ్‌ఎల్‌‌కు ఉంది. ఇందులోని మెజారిటీ వాటాను జీవీకేఏహెచ్‌ఎల్‌‌ప్రమోటర్లు మూడు ప్రైవేట్ ‌బ్యాంకుల దగ్గర తనఖాగా పెట్టిరూ. 2,150 కోట్ల విలువైన లోన్లు తీసుకున్నారు. ఈ అప్పును ఇంకొన్ని నెలల్లో తీర్చకపోతే, ఈ తనఖా షేర్ల‌ను థర్డ్‌‌పార్టీకి ఈ మూడు ప్రైవేట్ బ్యాంకులు అమ్మేసే అవకాశం ఉంది. ప్రమోటర్లు తనఖాగా పెట్టిన షేర్ల‌ విలువ ప్రస్తుత ఎంతో తెలియలేదు. జీవీకే ఎయిర్ ‌‌‌‌పోర్ట్ ‌‌హోల్డింగ్స్ ‌‌ప్రమోటర్లు ఈ వార్తలను ఖండించారని జీవీకే అధికారులు చెప్పారు. ముంబై ఎయిర్ ‌‌‌పోర్ట్ లో‌‌ కంట్రోల్ ‌‌కోసం చూస్తున్న అదానీ గ్రూప్‌, ఈ ప్రైవేట్‌‌బ్యాంకుల నుంచి తనఖా షేర్ల‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని చెప్పారు. మియల్‌‌లో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు జీవీకేతో అదానీ గ్రూప్‌ చర్చలు జరిపిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

గతంలో సౌతాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌‌నుంచి మియల్‌‌లో మైనార్టీ వాటాను కొనాలని అదానీ గ్రూప్ ‌ప్రయత్నించింది. కానీ ‘ఫస్ట్‌‌రిఫ్యూజల్‌‌’ క్లాజ్‌ను జీవీకే వాడడంతో ఈ ట్రాన్సాక్షన్‌ ఆగిపోయింది. గతేడాది అక్టోబర్‌‌‌‌లో బిడ్ ‌వెస్ట్ ‌‌నుంచి మియల్ ‌‌మైనార్టీ వాటాను కొనేందుకు జీవీకే ఎయిర్‌‌‌‌పోర్ట్‌ హోల్డింగ్స్ డీల్ ‌‌కుదుర్చుకుంది. కానీ జీవీకే పేమెంట్స్ ‌‌పూర్తి చేయడంలో విఫలమయ్యింది. దీనిపై బిడ్‌వెస్ట్‌‌కోర్టుకు
కూడా వెళ్లింది.