డాక్యుమెంట్లు షేర్‌‌‌‌ చేసేందుకు జీవీకే కొత్త ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌

డాక్యుమెంట్లు షేర్‌‌‌‌ చేసేందుకు జీవీకే కొత్త ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డిజిటల్ డాక్యుమెంట్లను ఈజీగా, సేఫ్‌‌‌‌గా షేర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి వీలుకలిపించే  ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను జీవీకే  కేశవ్‌‌‌‌ రెడ్డి, రాజీవ్‌‌‌‌ రంజన్‌‌‌‌ లాంచ్ చేశారు.  ప్రభుత్వ సంస్థ డిజిలాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘ఈక్వల్‌‌‌‌’ అనే ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను  డెవలప్‌‌‌‌ చేశారు. హోటల్‌‌‌‌, కోవర్కింగ్ స్పేస్‌‌‌‌లో చెకిన్స్‌‌‌‌, రియల్‌‌‌‌ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లు, ఉద్యోగుల  వెరిఫికేషన్  ప్రాసెస్‌‌‌‌, ఇన్సూరెన్స్ క్లయిమ్స్‌‌‌‌,  హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌ వంటి వివిధ సెగ్మెంట్ల నుంచి 10 లక్షల బెటా డేటా యూజర్లు తమకు ఉన్నారని కంపెనీ చెబుతోంది. 

‘యూజర్లకు సంబంధించిన అన్ని రకాల పర్సనల్‌‌‌‌ ఐడెంటిఫికేషన్ వివరాలు, డేటాను ఓ వాల్ట్‌‌‌‌లో స్టోర్‌‌‌‌‌‌‌‌ చేస్తాం. సెక్యూరిటీ కోసం టోకనైజేషన్‌‌‌‌ను వాడుతున్నాం. గుర్తు తెలియని వారు డేటాను యాక్సెస్ చేయకుండా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ ఎన్‌‌‌‌క్రిప్షన్‌‌‌‌ విధానాన్ని యూజ్ చేస్తున్నాం’ అని కేశవ్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఆయన యారజన్‌‌‌‌ లైఫ్ సైన్సెస్‌‌‌‌లో బోర్డు మెంబర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు.   బ్యాంకుల్లో వాడుతున్న  సెక్యూరిటీనే   ఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో యూజ్‌‌‌‌ చేస్తున్నామని  కేశవ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండిపెండెంట్ ఏజెన్సీలతో టెస్టింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. 10 కోట్ల మంది యూజర్లను సాధించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు.