మిర్యాలగూడ, వెలుగు: మిషన్ భగీరథ కార్మికులకు ఏపీకి చెందిన జీవీపీఆర్ సంస్థ ఐదు నెలలుగా జీతాలివ్వడం లేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ మండిపడ్డారు. మంగళవారం అవంతీపురం మిషన్ భగీరథ ప్లాంట్ఎదుట, మిర్యాలగూడ–కోదాడ ప్రధాన రహదారిపై కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవీపీఆర్ సంస్థ రూ. 15 వేలు ఉన్న జీతాలను రూ. 9 వేలకు తగ్గించిదని, అవి కూడా ఐదు నెలలగా ఇవ్వడం లేదని వాపోయారు. వెంటనే జీతాలు చెల్లించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని జీవీపీఆర్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతామని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక సంఘం అధ్యక్షుడు వేణు నాయక్, రవి, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు సిద్దు నాయక్, పొలాగని వెంకటేష్ గౌడ్, అబ్దుల్లా, శరత్, విష్ణు, ఇమ్రాన్, మస్తాన్, మహేశ్, చందు నాయక్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.