Viral Video: రీల్స్ పిచ్చి.. ఏకంగా ఓ అపార్టుమెంటునే తగలబెట్టింది

Viral Video: రీల్స్ పిచ్చి.. ఏకంగా ఓ అపార్టుమెంటునే తగలబెట్టింది

రీల్స్ పిచ్చి ఎంత పనిచేసిందో చూడండి.. ఏకంగా అపార్టుమెంట్ నే తగలబెట్టింది. ఈ మధ్య కాలంలో జనాల్లో రీల్స్ పిచ్చిబాగా ముదిరిపోయింది. తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు పొందాలని కొందరూ. రీల్స్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఇంకొందరు ఆరాటపడుతున్నారు. ఏదీపడితే అది రీల్స్ చేయడం..ఇంటర్నెట్ పెట్టడం..అంతవరకు బాగానే ఉంది.. ఇంకొందరు ప్రమాదకరమైన స్టంట్లు, ఏకంగా ప్రాణాలు తీసే ప్రయోగాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. రీల్స్ చేసేందుకు ఓ మహిళ గ్యాస్ సిలిండర్ లీక్ చేసింది. ఇంకేముంది..జరగాల్సిందంతా జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చందిన రంజనా జాట్ కు రీల్స్ పిచ్చి. ఎప్పుడు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో లైకులు కామెంట్లకోసం ఆరాటపడుతుంటుంది. బుధవారం (మార్చి 5)  రాత్రి కూడా రీల్స్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి తీవ్రంగా పడింది.. ఆమెతో పాటు ఆమె బంధువు కూడా ఆస్పత్రిపాలయ్యాడు. రంజనా ఉంటున్న ప్లాట్ తోపాటు ఏడు అంతస్తుల భవనంలోని అనేక ఫ్లాట్‌లు దెబ్బతిన్నాయి.

ALSO READ | Holy 2025: వింత ఆచారం: కొత్త అల్లుడు హోలీ రోజు ఆ ఊరు వెళ్లాడా..గాడిదపై ఊరేగాల్సిందే...!

ఈ సంఘటన గ్వాలియర్ లోని భిండ్ రోడ్డులోని ది లెగసీ ప్లాజా భవనంలో బుధవారం రాత్రి జరిగింది. రంజనా జాట్, ఆమె బంధువు అనిల్ జాట్తో కలిసి తన మొదటి అంతస్తులోని ఫ్లాట్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా తెల్లవారుజామున 2:15 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. వీడియోను రికార్డ్ చేస్తున్న సమయంలో జాట్ గాలిలోకి గ్యాస్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇది తీవ్రపరిణామాలకు దారితీసింది.

దాదాపు 17 నిమిషాల పాటు ఆ జంట ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం లైటింగ్ పెంచేందుకు అనిల్ జాట్ CFL లైట్‌ను ఆన్ చేశాడు.. ఇంకేముంది..ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలి విధ్వంసం సృష్టించింది. 

ఆ ప్రమాదకర రీల్స్.. భవనంలో భారీ మంటలకు దారితీసింది. ఎనిమిది ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. గ్యాస్ లీక్ కారణంగా జరిగిన పేలుడులో రంజనాజాట్, అనిల్ జాట్కు మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు రంజనా బెడ్ రూంతోపాటు ఫ్లాట్ ధ్వంసమైంది.పొరుగుఉన్న వారి ఆస్తులకు నష్టం వాటిల్లింది. 

రంజనాజాట్, అనిల్ జాట్ ఇద్దరు రాత్రి పూట ఎక్కువగా రీల్స్  చేసేవారని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేయడం అలవాటు పడ్డారని.. మండే పదార్థాలను నిర్లక్ష్యంగా ఉపయోగించినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 287 కింద కేసు నమోదు చేశారు.