ఎంపీ ఎక్స్(ట్విటర్) అకౌంట్‪లో బాడీ మసాజ్ యాడ్స్

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా లక్షల సొమ్ము లాగేస్తున్నారు. ఈసారి ఏకంగా మధ్యప్రదేశ్ లోని ఓ ఎంపీ అఫిషియల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. గ్వాలియర్ ఎంపీ వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్‌ ఎక్స్ (ట్విటర్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సౌదీ అరేబియాకు దేశానికి చెందిన హ్యాకర్ ఆయన అధికారిక ఎక్స్ అకౌంట్ హ్యాడిల్ చేస్తున్నట్లు గుర్తించారు.  నారాయణ్ బయో లోకేషన్ కూడా కింగ్ డమ్‪ఆఫ్ సౌదీ అరేబీయాగా మార్చారు. బాడీ మసాజ్, బెస్ట్ స్పా సెంటర్ అంటూ ఓ ప్రకటన పోస్ట్ చేశారు. 

బెస్ట్ మసాజ్ సెంటర్, క్యాండిల్ లైట్ రిలాక్సింగ్ మసాజ్, అందమైన అమ్మాయిలతో  మ్యూజిక్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ మాసాజ్ సర్వీస్ అందిస్తామని అరబిక్ భాషలో రాసుకొచ్చారు. ఆర్డర్ కోసం వాట్సాప్ లో సంప్రదించామని పోస్ట్ చేశారు. ఈ విషయంపై ఎంపీ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. తిరిగి ఆయన అకౌంట్ పొందేందుకు సైబర్ ఎక్స్‪పర్ట్స్ సహాయం తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు ఓ ఎంపీ అఫిషియల్ ట్విటర్ అకౌంటే హ్యాక్ అయింది అంటే సామాన్య ప్రజలకు ఏం భద్రత ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.