సిగ్నల్స్​ దగ్గర నీడకోసం తెరలు

సిగ్నల్స్​ దగ్గర నీడకోసం తెరలు

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వాహనదారుల సౌలభ్యం కోసం నీడ తెరల ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా మేయర్​ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం హనుమకొండ పరిధి అదాలత్ సిగ్నల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నీడ తెరలను మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నగర పరిధిలోని హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో వాహనదారులకు ఉపశమనం కోసం జీడబ్ల్యూఏంసీ తరఫున నీడతెరలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ రవి కుమార్, డీఈలు రాజ్ కుమార్, కార్తీక్ రెడ్డి, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.