వరంగల్ పబ్లిక్కు అలర్ట్.. కొంపదీసి ఖిలా వరంగల్ రోడ్లో ఉన్న.. రెడ్ బకెట్లో బిర్యానీ తిన్నారా..?

వరంగల్ పబ్లిక్కు అలర్ట్.. కొంపదీసి ఖిలా వరంగల్ రోడ్లో ఉన్న.. రెడ్ బకెట్లో బిర్యానీ  తిన్నారా..?

వరంగల్: వరంగల్లోని ఖిలా వరంగల్ కోట రోడ్లో ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(GWMC) అధికారులు తనిఖీలు చేశారు. ఈ బిర్యానీ సెంటర్లో నిల్వ ఉంచిన బిర్యానీని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బిర్యానీ బకెట్లు కనిపించడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. పరిసరాల అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. నిల్వ ఉంచిన ఆహారం కస్టమర్లకు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిర్వాహకులకు అధికారులు జరిమానా విధించారు. 

బిర్యానీని నిల్వ ఉంచి కస్టమర్లకు ఇస్తున్నందుకు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచినందుకు వరంగల్ రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులకు GWMC MHO అధికారి రాజిరెడ్డి రూ. 20 వేల జరిమానా విధించారు. బ్రాండెడ్​అని చెప్పుకుంటున్న హోటల్స్​, రెస్టారెంట్లు, కేఫ్ల్లో ఆహార నాణ్యతా ప్రమాణాలను కనీసం పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రిజ్లో నిల్వ చేసిన మాంసం, అన్నం, ఎక్స్​పైరీ అయిన ఆహార పదార్థాలు, పిండి, అపరిశుభ్రమైన కిచెన్​ఇలా తనిఖీలు చేసే కొద్దీ వాటిలోని అసలు క్వాలిటీ బయటపడుతుండటం గమనార్హం.

ఫుడ్​సేఫ్టీ స్టాండర్డ్స్​ప్రకారం కిచెన్ను ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచాలి. కుళ్లిపోయిన కూరగాయాలు, ఎక్స్​పైరీ అయిన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు చెక్​చేసి బయటపడేయాలి. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. లేబుల్స్​ఉన్న ఫుడ్​ను మాత్రమే సర్వ్​చేయాలి. ఫుడ్​ఐటమ్స్లో వాడే పదార్థాలపై మ్యాన్​ఫ్యాక్చరింగ్​డేట్, ఎక్స్​పైరీ డేట్​ ఖచ్చితంగా ముద్రించి ఉండాలి. వెజ్​ఫుడ్, నాన్​వెజ్​ఫుడ్​ప్రియులు వేరు వేరుగా ఉంటారు కాబట్టి ఎప్పుడూ రెండు రకాలను ఒకే చోట నిల్వ చేయకూడదు.

చెఫ్లతో పాటు అక్కడ పని చేస్తున్న సిబ్బంది తల వెంట్రుకలు ఫుడ్లో పడకుండా హెడ్​ క్యాప్​ పెట్టుకోవాలి. కానీ ఈ రూల్స్​చాలా రెస్టారెంట్లు, హోటళ్లు పాటించడం లేదు. అంతేగాకుండా క్వాలిఫైడ్​చెఫ్లను పెట్టుకోకుండా వంట  ఎవరికి వస్తే వారిని నియమించుకుంటున్నారు. ఈ లోపాలన్నీ బయటపడతాయని చాలా హోటల్స్, రెస్టారెంట్లు తమ కిచెన్ను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాయి.