వరంగల్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు దూకుడు పెంచారు. వరంగల్ నాయుడు పంపు చౌరస్తాలో కోట్లాది రూపాయల విలువ చేసే ఎకరం భూమిని... గత ప్రభుత్వం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి కేటాయించింది. పార్టీ ఆఫీస్ కోసం మాజీ మంత్రి కేటీఆర్.. భూమి పూజ కూడా చేశారు. పదినెలలు గడిచినా పార్టీ కార్యాలయం భవనం నిర్మించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన భూమిలో కమర్షియల్ షట్టర్లను నిర్మాణించారు.
పార్టీ ఆఫీస్ కోసం కేటాయించిన భూమిలో కొంతమంది బడా నేతలు... అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆక్రమ నిర్మాణాలపై నెటిజన్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. దీంతో జనవరి 27వ తేదీ శనివారం ఉదయం అధికారులు.. పోలీసు బలగాల బందోబస్తు మధ్య షెట్టర్లు కూల్చివేసస్తున్నారు. బీఆర్ఎస్ కోసం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. వరంగల్ ఆర్టిఏ కార్యాలయం సమీపంలో పుల్లాయికుంట సర్వే నంబర్ 140 లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్స్ తోపాటు, నగరంలోని 11వ డీవిజన్ ములుగు రోడ్ కాపువాడలో అక్రమ నిర్మాణాలను GWMC, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడడంతో బల్దియా టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేశారు.