
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపడతారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన ఆయన జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు విచారణలను కూడా ఆయన క్రమం తప్పకుండా పర్యవేక్షించినట్టు సమాచారం.
జ్ఞానేశ్‌కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. ఐసీఎఫ్ఏఐలో బిజినెస్ ఫైనాన్స్, యూఎస్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హెచ్ఐఐడీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదివాడు. 2024 జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ సెక్రటరీగా రిటైర్ అయిన జ్ఞానేశ్ 2024 మార్చిలో ఇండియా 26వ సీఈసీగా ఎంపికయ్యారు. ఎన్నికల కమిషన్(ఈసీ) సభ్యుల నియామకంలో మార్పులు చేసి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామకం పొందిన ఫస్ట్ సీఈసీ జ్ఞానేశ్కుమారే.