జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి.. ముస్లింల పిటిషన్ కొట్టివేత

 జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి..  ముస్లింల పిటిషన్ కొట్టివేత

జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు కొనసాగించవచ్చుని తెలిపింది. ముస్లిం పక్షం దాఖలు చేసిన  పిటిషన్ ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది.  అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. మసీదులో నేలమాళిగలో నాలుగు సెల్లార్లు ఉన్నాయి, వాటిలో ఒకటి ఇప్పటికీ అక్కడ నివసించే వ్యాస్ కుటుంబం ఆధీనంలో ఉంది.

జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.  అయితే దీనిని  సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. 

పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు అంజుమన్ దాఖలైన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది.   జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 15న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

 జ్ఞానవాపిలో 1993 నుంచి హిందువులు పూజ చేయడం లేదు. ఇటీవల కోర్టు తీర్పుతో పూజ చేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పూజలు చేశారు