జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశాలు

జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రేపటివరకు విచారణ కొనసాగించవద్దని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను రేపు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని... మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వారణాసి కోర్టు నియమించిన సర్వే బృందం కూడా నివేదిక సమర్పించింది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా... రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.