న్యూ బోయగూడలో ఘనంగా గ్యార్వీ ఉత్సవాలు

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయగూడలోని రైల్ కళారంగ్ వద్ద ఆదివారం గ్యార్వీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  గౌస్ ఏ పాక్ చిల్లా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, నేతలు వెంకటేషన్ రాజు, ఏసూరి మహేశ్, లక్ష్మీపతి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, ఫహీం, కుమార్ యాదవ్, అబ్బాస్, కుషాల్ పాల్గొన్నారు.